తెలుగు అనువాదంతో సూరా యాసీన్

తెలుగు అనువాదంతో కూడిన సూరహ్ యాసీన్ మానవ జీవితంపై అనేక ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ప్రభావాలను చూపుతుంది. ఇది ఖురాన్ యొక్క 22వ మరియు 23వ పేరాలో కనిపించే పవిత్ర ఖురాన్ యొక్క 36వ అధ్యాయం. సూరహ్ యాసీన్ శక్తివంతమైన మార్గదర్శకత్వం మరియు జ్ఞానాన్ని అందిస్తుంది. దీని అనువాదాన్ని చదవడం ముస్లింలు దాని సందేశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, జ్ఞానాన్ని పెంచడానికి మరియు దాని బోధనలను మరింత అర్థవంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఇది రోజువారీ జీవితానికి స్పష్టతను తీసుకువచ్చే నైతిక మరియు నైతిక పాఠాలను కూడా అందిస్తుంది.

ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో సూరహ్ యాసీన్ లోని 83 శ్లోకాలు మనశ్శాంతిని కలిగిస్తాయి. అరబిక్‌లో దీనిని పఠించడం ఆధ్యాత్మిక ప్రతిఫలాన్ని తెస్తుంది, అనువాదం ద్వారా పూర్తి అర్థాన్ని అర్థం చేసుకోవడం లోతైన సంబంధాన్ని అనుమతిస్తుంది. సూరహ్ యాసీన్ 95+ భాషలలో అందుబాటులో ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ముస్లిం దాని సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కనీసం ఒక్కసారైనా పూర్తి అనువాదాన్ని చదవమని ప్రోత్సహించబడ్డారు. పాఠకులు సూరహ్ యాసీన్‌ను ఆన్‌లైన్‌లో పఠించడం లేదా పూర్తి సూరహ్ యాసీన్ తెలుగు PDFని డౌన్‌లోడ్ చేసుకోవడం మరియు త్వరిత ప్రాప్యత కోసం వారి పరికరాల్లో సేవ్ చేయడం సులభం – ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా.

సూరా యాసీన్ తెలుగు ఆడియో వినండి

ఆన్‌లైన్‌లో తెలుగు అనువాదంతో పూర్తి సూరా యాసీన్ చదవండి

36.1

يسٓ

యా-సీన్‌.ا

Tafseer

Tafseer

36.0

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్‌ పేరుతోا

Tafseer

Tafseer

36.3

إِنَّكَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ

(ఓ ము హమ్మద్‌!) నిశ్చయంగా, నీవు సందేశ హరులలో ఒకడవు.ا

Tafseer

Tafseer

36.2

وَٱلۡقُرۡءَانِ ٱلۡحَكِيمِ

వివేకంతో నిండిఉన్న ఖుర్‌ఆన్‌ సాక్షిగా!ا

Tafseer

Tafseer

36.5

تَنزِيلَ ٱلۡعَزِيزِ ٱلرَّحِيمِ

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సర్వశక్తిమంతుడు, అపార కరుణాప్రదాత ద్వారానే అవతరింపజేయ బడింది.ا

Tafseer

Tafseer

36.4

عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ

(నీవు) రుజుమార్గంపై ఉన్నావు.ا

Tafseer

Tafseer

36.7

لَقَدۡ حَقَّ ٱلۡقَوۡلُ عَلَىٰٓ أَكۡثَرِهِمۡ فَهُمۡ لَا يُؤۡمِنُونَ

వాస్తవానికి వారిలో అనేకులను గురించి మా వాక్కు నిజం కానున్నది, కావున వారు విశ్వసించరు.ا

Tafseer

Tafseer

36.6

لِتُنذِرَ قَوۡمٗا مَّآ أُنذِرَ ءَابَآؤُهُمۡ فَهُمۡ غَٰفِلُونَ

ఏ జాతివారి తండ్రి-తాతలైతే హెచ్చరిక చేయబడక, నిర్లక్ష్యులై ఉన్నారో, వారిని హెచ్చరించటానికి.ا

Tafseer

Tafseer

36.9

وَجَعَلۡنَا مِنۢ بَيۡنِ أَيۡدِيهِمۡ سَدّٗا وَمِنۡ خَلۡفِهِمۡ سَدّٗا فَأَغۡشَيۡنَٰهُمۡ فَهُمۡ لَا يُبۡصِرُونَ

మరియు మేము వారి ముందు ఒక అడ్డు (తెర)ను మరియు వారి వెనుక ఒక అడ్డు (తెర)ను నిలబెట్టాము. మరియు మేము వారిని కప్పి వేశాము అందువల్ల వారు ఏమీ చూడలేరు..ا

Tafseer

Tafseer

36.8

إِنَّا جَعَلۡنَا فِيٓ أَعۡنَٰقِهِمۡ أَغۡلَٰلٗا فَهِيَ إِلَى ٱلۡأَذۡقَانِ فَهُم مُّقۡمَحُونَ

నిశ్చయంగా, మేము వారి మెడలలో పట్టాలు వేశాము. అవి వారి గడ్డాలవరకు వున్నాయి. కావున వారి తలలు నిక్కివున్నాయి.ا

Tafseer

Tafseer

36.11

إِنَّمَا تُنذِرُ مَنِ ٱتَّبَعَ ٱلذِّكۡرَ وَخَشِيَ ٱلرَّحۡمَٰنَ بِٱلۡغَيۡبِۖ فَبَشِّرۡهُ بِمَغۡفِرَةٖ وَأَجۡرٖ كَرِيمٍ

నిశ్చయంగా, ఎవడైతే హితబోధను అనుస రిస్తూ, అగోచరుడైన కరుణామయునికి భయపడ తాడో! అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష మరియు మంచి ప్రతిఫలం (స్వర్గం) లభిస్తుందనే శుభవార్తను అందజేయి.ا

Tafseer

Tafseer

36.10

وَسَوَآءٌ عَلَيۡهِمۡ ءَأَنذَرۡتَهُمۡ أَمۡ لَمۡ تُنذِرۡهُمۡ لَا يُؤۡمِنُونَ

మరియు నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించక పోయినా, వారికి సమానమే, వారు విశ్వసించరు!ا

Tafseer

Tafseer

36.13

وَٱضۡرِبۡ لَهُم مَّثَلًا أَصۡحَٰبَ ٱلۡقَرۡيَةِ إِذۡ جَآءَهَا ٱلۡمُرۡسَلُونَ

వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల గాథను వినిపించుا

Tafseer

Tafseer

36.12

إِنَّا نَحۡنُ نُحۡيِ ٱلۡمَوۡتَىٰ وَنَكۡتُبُ مَا قَدَّمُواْ وَءَاثَٰرَهُمۡۚ وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ فِيٓ إِمَامٖ مُّبِينٖ

నిశ్చయంగా, మేము మృతులను సజీవులుగా చేస్తాము. మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసి పెడుతున్నాము. మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెడు తున్నాము.ا

Tafseer

Tafseer

36.15

قَالُواْ مَآ أَنتُمۡ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا وَمَآ أَنزَلَ ٱلرَّحۡمَٰنُ مِن شَيۡءٍ إِنۡ أَنتُمۡ إِلَّا تَكۡذِبُونَ

(దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏ (సందేశాన్నీ) అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలాడు తున్నారు?ا

Tafseer

Tafseer

36.14

إِذۡ أَرۡسَلۡنَآ إِلَيۡهِمُ ٱثۡنَيۡنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزۡنَا بِثَالِثٖ فَقَالُوٓاْ إِنَّآ إِلَيۡكُم مُّرۡسَلُونَ

మేము వారి వద్దకు ఇద్దరిని పంపగా వారు ఆ ఇద్దరినీ అబద్ధీకులని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని మూడవ వానితో బలపరి చాము. అప్పుడు వారు, వారితో: నిశ్చయంగా, మేము (మీ వద్దకు పంపబడిన) సందేశహరులం. అని అన్నారు.ا

Tafseer

Tafseer

36.17

وَمَا عَلَيۡنَآ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ

మా బాధ్యత కేవలం మీకు స్పష్టంగా సందేశాన్ని అందజేయటమే!ا

Tafseer

Tafseer

36.16

قَالُواْ رَبُّنَا يَعۡلَمُ إِنَّآ إِلَيۡكُمۡ لَمُرۡسَلُونَ

(ఆ ప్రవక్తలు) అన్నారు: మా ప్రభువుకు తెలుసు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము!ا

Tafseer

Tafseer

36.19

قَالُواْ طَـٰٓئِرُكُم مَّعَكُمۡ أَئِن ذُكِّرۡتُمۚ بَلۡ أَنتُمۡ قَوۡمٞ مُّسۡرِفُونَ

(ఆ ప్రవక్తలు) అన్నారు: మీ అపశకునం మీ వెంటనే ఉంది. మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరిపోయిన ప్రజలు.ا

Tafseer

Tafseer

36.18

قَالُوٓاْ إِنَّا تَطَيَّرۡنَا بِكُمۡۖ لَئِن لَّمۡ تَنتَهُواْ لَنَرۡجُمَنَّكُمۡ وَلَيَمَسَّنَّكُم مِّنَّا عَذَابٌ أَلِيمٞ

(ఆనగరవాసులు) అన్నారు: నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక దుశ్శకునంగా పరిగ ణిస్తున్నాము. మీరు దీనిని మానుకోకపోతే, మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తాము. మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది.ا

Tafseer

Tafseer

36.21

ٱتَّبِعُواْ مَن لَّا يَسۡـَٔلُكُمۡ أَجۡرٗا وَهُم مُّهۡتَدُونَ

మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరని వారిని (ఈ సందేశహరులను) అనుసరించండి! వారు సన్మార్గంలో ఉన్నారు.ا

Tafseer

Tafseer

36.20

وَجَآءَ مِنۡ أَقۡصَا ٱلۡمَدِينَةِ رَجُلٞ يَسۡعَىٰ قَالَ يَٰقَوۡمِ ٱتَّبِعُواْ ٱلۡمُرۡسَلِينَ

ఆ నగరపు దూర ప్రాతం నుండి ఒకవ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: ఓ నా జాతి ప్రజలారా! ఈ సందేశహరులను అనుసరించండి!ا

Tafseer

Tafseer

36.23

أَأَتَّخِذُ مِنْ دُونِهِ آلِهَةً إِنْ يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنْقِذُونِ

ఏమీ? ఆయనను వదలి నేను ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకోవాలా? ఒకవేళ ఆ కరుణామయుడు నాకు హాని చేయదలచుకుంటే, వారి సిఫారసు నాకు ఏ మాత్రం ఉపయోగపడదు మరియు వారు నన్ను కాపాడనూ లేరు.ا

Tafseer

Tafseer

36.22

وَمَا لِيَ لَآ أَعۡبُدُ ٱلَّذِي فَطَرَنِي وَإِلَيۡهِ تُرۡجَعُونَ

మరియు నన్నుసృష్టించిన ఆయనను నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.ا

Tafseer

Tafseer

36.25

إِنِّي آمَنْتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ

నిశ్చయంగా మీరందరి ప్రభువును, నేను విశ్వసించాను, కావున మీరు నా మాట వినండి!ا

Tafseer

Tafseer

36.24

إِنِّي إِذًا لَفِي ضَلَالٍ مُبِينٍ

అలా చేస్తే నిశ్చయంగా, నేను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయిన వాడిని అవుతాను.ا

Tafseer

Tafseer

36.27

بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ

నా ప్రభువు నన్ను క్షమించాడు మరియు నన్నుగౌరవనీయులలోకి ప్రవేశింపజేశాడు! అనేది.ا

Tafseer

Tafseer

36.26

قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۖ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ

(అతనిని వారుచంపినతరువాత అతనితో) ఇలా అనబడింది: నీవు స్వర్గంలో ప్రవేశించు. అతడు ఇలా అన్నాడు: అయ్యో! నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండేది!ا

Tafseer

Tafseer

36.29

إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خَامِدُونَ

అది కేవలం ఒక పెద్ద ధ్వని మాత్రమే! అంతే! వారంతా (ఒకేసారి) అంతంచేయబడ్డారు.ا

Tafseer

Tafseer

36.28

وَمَا أَنْزَلْنَا عَلَىٰ قَوْمِهِ مِنْ بَعْدِهِ مِنْ جُنْدٍ مِنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنْزِلِينَ

మరియు ఆ తరువాత అతని జాతి వారి మీదకు, మేము ఆకాశంనుండి ఏ సైన్యాన్నీ పంపలేదు. అసలు మాకు సైన్యాన్ని పంపే అవసరమే ఉండదు!.ا

Tafseer

Tafseer

36.31

أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا يَرْجِعُونَ

ఏమీ? వారుచూడలేదా (వారికి తెలియదా)? వారికి ముందు మేము ఎన్నో తరాలను నాశనం చేశామని? నిశ్చయంగా, వారు (వారి పూర్వీ కులు) ఎన్నటికీ వారి వద్దకు తిరిగిరాలేదు.ا

Tafseer

Tafseer

36.30

يَا حَسْرَةً عَلَى الْعِبَادِ ۚ مَا يَأْتِيهِمْ مِنْ رَسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ

ఆ దాసులగతి ఎంత శోచనీయమయినది! వారి వద్దకు ఏ సందేశహరుడు వచ్చినా, వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండలేదు.ا

Tafseer

Tafseer

36.33

وَآيَةٌ لَهُمُ الْأَرْضُ الْمَيْتَةُ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا مِنْهَا حَبًّا فَمِنْهُ يَأْكُلُونَ

మరియు వారి కొరకు సూచనగా జీవంలేని ఈ భూమియే ఉంది. మేము దీనికి ప్రాణం పోసి, దీని నుండి ధాన్యం తీస్తాము, దాన్ని వారు తింటారు.ا

Tafseer

Tafseer

36.32

وَإِنْ كُلٌّ لَمَّا جَمِيعٌ لَدَيْنَا مُحْضَرُونَ

కాని వారందరినీ కలిపి ఒకేసారి, మా ముందు హాజరుపరచడం జరుగుతుంది.ا

Tafseer

Tafseer

36.35

لِيَأْكُلُوا مِنْ ثَمَرِهِ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ ۖ أَفَلَا يَشْكُرُونَ

వారు దీని ఫలాలను తినటానికి మరియు ఇదంతా వారి చేతులు చేసింది కాదు. అయినా వారు కృతజ్ఞతలు తెలుపరా?ا

Tafseer

Tafseer

36.34

وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِنْ نَخِيلٍ وَأَعْنَابٍ وَفَجَّرْنَا فِيهَا مِنَ الْعُيُونِ

మేము దీనిలో ఖర్జూరపు మరియు ద్రాక్ష వనాలను పెంచాము మరియు వాటిలో ఊటలను ప్రవహింపజేశాము.ا

Tafseer

Tafseer

36.37

وَآيَةٌ لَهُمُ اللَّيْلُ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُمْ مُظْلِمُونَ

మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి మేము దానిపైనుండి పగటిని (వెలుగును) తొలగించినప్పుడు, వారిని చీకటి ఆవరించుకుంటుంది.ا

Tafseer

Tafseer

36.36

سُبْحَانَ الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنْبِتُ الْأَرْضُ وَمِنْ أَنْفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُونَ

భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా వారికి తెలియని వాటిలోనూ (ఆడ-మగ) జతలను సృష్టించిన, ఆయన (అల్లాహ్‌) లోపాలకు అతీతుడు.ا

Tafseer

Tafseer

36.39

وَالْقَمَرَ قَدَّرْنَاهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ

మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము, చివరకు అతడు ఎండిన ఖర్జూరపు మట్టవలే అయిపోతాడు.ا

Tafseer

Tafseer

36.38

وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَهَا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ

మరియు సూర్యుడు తన నిర్ణీతపరిధిలో, నిర్ణీత కాలంలో పయనిస్తూ ఉంటాడు. ఇది ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియమావళి.ا

Tafseer

Tafseer

36.41

وَآيَةٌ لَهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلْكِ الْمَشْحُونِ

వారికి మరొక సూచన ఏమిటంటే, నిశ్చయంగా, మేము వారి సంతతిని (నూ హ్‌ యొక్క) నిండు నావలోనికి ఎక్కించాము.ا

Tafseer

Tafseer

36.40

لَا الشَّمْسُ يَنْبَغِي لَهَا أَنْ تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ ۚ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ

చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరం కాదు. మరియు రాత్రి పగటిని అధిగమించ జాలదు. మరియు అవన్నీ తమ-తమ కక్ష్యలలో సంచరిస్తూ ఉంటాయి..ا

Tafseer

Tafseer

36.43

وَإِنْ نَشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنْقَذُونَ

మరియు మేముకోరినట్లయితే వారిని ముంచి వేసే వారము అప్పుడు వారికేకలు వినేవాడెవడూ ఉండడు మరియు వారు రక్షింపబడనూలేరు –ا

Tafseer

Tafseer

36.42

وَخَلَقْنَا لَهُمْ مِنْ مِثْلِهِ مَا يَرْكَبُونَ

మరియుమేము వారుఎక్కి ప్రయాణంచేయ టానికి, ఇటువంటి వాటిని ఎన్నోసృష్టించాము.ا

Tafseer

Tafseer

36.45

وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ

మరియు వారితో: మీరు, మీ ముందున్న దానికీ (ఇహలోక శిక్షకూ) మరియు మీ వెనుక రానున్న దానికీ (పరలోక శిక్షకూ) భీతిపరులై ఉండండి – మీరు కరుణించబడతారు! అని అన్నప్పుడు, (వారు లక్ష్యం చేయటం లేదు).ا

Tafseer

Tafseer

36.44

إِلَّا رَحْمَةً مِنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ

మేము కరుణిస్తే తప్ప – మరియు మేము కొంత కాలం వరకు వారికి వ్యవధినిస్తే తప్ప!ا

Tafseer

Tafseer

36.47

وَإِذَا قِيلَ لَهُمْ أَنْفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَنْ لَوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنْتُمْ إِلَّا فِي ضَلَالٍ مُبِينٍ

మరియు వారితో: అల్లాహ్‌ మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేయండి. అని అన్నప్పుడు సత్య-తిరస్కారులు విశ్వాసు లతో అంటారు: ఏమీ? అల్లాహ్‌ కోరితే, తానే తినిపించగల వారికి, మేము తినిపించాలా? మీరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.ا

Tafseer

Tafseer

36.46

وَمَا تَأْتِيهِمْ مِنْ آيَةٍ مِنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ

మరియు వారి ప్రభువు సూచనలలో నుండి, వారి వద్దకు ఏ సూచన వచ్చినా, వారు దాని నుండి ముఖం త్రిప్పుకోకుండా ఉండలేదు.ا

Tafseer

Tafseer

36.49

مَا يَنْظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ

వారు నిరీక్షిస్తున్నది కేవలం ఒక పెద్దధ్వని కొరకే. మరియు వారు వాదులాడుకుంటూ ఉండగానే, అది వారిని చిక్కించుకుంటుంది.ا

Tafseer

Tafseer

36.48

وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِنْ كُنْتُمْ صَادِقِينَ

వారు ఇంకా ఇలా అంటారు: మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం (పునరుత్థానం) ఎప్పుడు పూర్తి కానున్నది?ا

Tafseer

Tafseer

36.51

وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُمْ مِنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنْسِلُونَ

మరియు (మరొక సారి) బాకా ఊదబడి నప్పుడు, వారంతా గోరీల నుండి (లేచి) తమ ప్రభువు వైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తారు.ا

Tafseer

Tafseer

36.50

فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ

వారు ఏవిధమైన వీలునామా కూడా వ్రాయలేరు మరియు తమ కుటుంబంవారి వద్దకు కూడా తిరిగి పోలేరు.ا

Tafseer

Tafseer

36.53

إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَدَيْنَا مُحْضَرُونَ

అది కేవలం ఒక పెద్ద ధ్వని మాత్రమే అయి ఉంటుంది! వెంటనే వారంతా మా ముందు హాజరు చేయబడతారు!ا

Tafseer

Tafseer

36.52

قَالُوا يَا وَيْلَنَا مَنْ بَعَثَنَا مِنْ مَرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ

వారంటారు: అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు? (వారితో అనబడుతుంది): ఇదే ఆ కరుణామయుడు చేసిన వాగ్దానం. మరియు అతని సందేశహరులు సత్యమే పలికారు!ا

Tafseer

Tafseer

36.55

إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ

నిశ్చయంగా, ఆ రోజు స్వర్గవాసులు సుఖ-సంతోషాలలో నిమగ్నులై ఉంటారు.ا

Tafseer

Tafseer

36.54

فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنْتُمْ تَعْمَلُونَ

ఆ రోజు ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం జరుగదు. మరియు మీ కర్మలకు తగినది తప్ప, మరే ప్రతిఫల మివ్వబడదు..ا

Tafseer

Tafseer

36.57

لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُمْ مَا يَدَّعُونَ

అందులో వారికి ఫలాలు మరియు వారు కోరేవన్నీ ఉంటాయి.ا

Tafseer

Tafseer

36.56

هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَّكِئُونَ

వారు మరియు వారి సహవాసులు (అ జ్వాజ్‌), చల్లని నీడలలో, ఆనుడు ఆసనాల మీద హాయిగా కూర్చొని ఉంటారు.ا

Tafseer

Tafseer

36.59

وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ

ఇంకా (ఇలాఅనబడుతుంది): ఓ అపరాధు లారా! ఈ నాడు మీరు వేరయిపొండి.ا

Tafseer

Tafseer

36.58

سَلَامٌ قَوْلًا مِنْ رَبٍّ رَحِيمٍ

మీకు శాంతి కలుగుగాక (సలాం)! అనే పలుకులు, అపార కరుణాప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి.ا

Tafseer

Tafseer

36.61

وَأَنِ اعْبُدُونِي ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ

మరియు మీరు నన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గమని!ا

Tafseer

Tafseer

36.60

أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَنْ لَا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ

ఓ ఆదమ్‌ సంతతివారలారా: షై తానును ఆరాధించకండి. అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు!,ا

Tafseer

Tafseer

36.63

هَٰذِهِ جَهَنَّمُ الَّتِي كُنْتُمْ تُوعَدُونَ

మీకు వాగ్దానంచేయబడిన ఆ నరకం ఇదే!ا

Tafseer

Tafseer

36.62

وَلَقَدْ أَضَلَّ مِنْكُمْ جِبِلًّا كَثِيرًا ۖ أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ

మరియు వాస్తవానికి వాడు (షై తాన్‌) మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు. ఏమీ? మీకు తెలివి లేక పోయిందా?ا

Tafseer

Tafseer

36.65

الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ أَرْجُلُهُمْ بِمَا كَانُوا يَكْسِبُونَ

ఆ రోజు మేము వారి నోళ్ళమీద ముద్ర వేస్తాము. మరియు వారేమి అర్జించారో వారి చేతులు మాతో చెబుతాయి మరియు వారి కాళ్ళు మా ముందు సాక్ష్యమిస్తాయి.ا

Tafseer

Tafseer

36.64

اصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنْتُمْ تَكْفُرُونَ

మీరు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నం దుకు ఈ రోజు దీనిలో ప్రవేశించండి (కాలండి).ا

Tafseer

Tafseer

36.67

وَلَوْ نَشَاءُ لَمَسَخْنَاهُمْ عَلَىٰ مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا مُضِيًّا وَلَا يَرْجِعُونَ

మరియు మేము కోరినట్లయితే, వారిని వారి స్థానంలోనే రూపాన్నిమార్చి ఉంచేవారం, అప్పుడు వారు ముందుకూ పోలేరు మరియు వెనుకకూ మరలలేరు.ا

Tafseer

Tafseer

36.66

وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَأَنَّىٰ يُبْصِرُونَ

మరియు మేము కోరినట్లయితే, వారి దృష్టిని నిర్మూలించేవారము, అప్పుడు వారు దారి కొరకు పెనుగులాడేవారు, కాని వారు ఎలా చూడగలిగే వారు?ا

Tafseer

Tafseer

36.69

وَمَا عَلَّمْنَاهُ الشِّعْرَ وَمَا يَنْبَغِي لَهُ ۚ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَقُرْآنٌ مُبِينٌ

మరియు మేము అతనికి (ము హమ్మద్‌ కు) కవిత్వం నేర్పలేదు. మరియు అది అతనికి శోభించదు కూడా! ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం (ఖుర్‌ఆన్‌) మాత్రమే.ا

Tafseer

Tafseer

36.68

وَمَنْ نُعَمِّرْهُ نُنَكِّسْهُ فِي الْخَلْقِ ۖ أَفَلَا يَعْقِلُونَ

మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతామో, అతని శారీరక రూపాన్ని మార్చు తాము. ఏమీ? వారు ఇది కూడా గ్రహించలేరా?ا

Tafseer

Tafseer

36.71

أَوَلَمْ يَرَوْا أَنَّا خَلَقْنَا لَهُمْ مِمَّا عَمِلَتْ أَيْدِينَا أَنْعَامًا فَهُمْ لَهَا مَالِكُونَ

ఏమివారికితెలియదా? నిశ్చయంగా మేము వారి కొరకు మా చేతులతో పశువులను సృష్టించి, తరువాతవాటిపైవారికియాజమాన్యం ఇచ్చామని?ا

Tafseer

Tafseer

36.70

لِيُنْذِرَ مَنْ كَانَ حَيًّا وَيَحِقَّ الْقَوْلُ عَلَى الْكَافِرِينَ

బ్రతికి వున్న ప్రతి వానికి హెచ్చరిక చేయటానికి మరియు సత్య-తిరస్కారుల ఎడల మా ఆదేశాన్ని నిరూపించటానికి!ا

Tafseer

Tafseer

36.73

وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ ۖ أَفَلَا يَشْكُرُونَ

మరియు వాటిలో వారికి ఎన్నో ప్రయోజ నాలు మరియు పానీయాలు (పాలు) ఉన్నాయి. అయినా, వారెందుకు కృతజ్ఞతలు చూపరు?ا

Tafseer

Tafseer

36.72

وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ

మరియు వాటిని, వారికి స్వాధీనపరిచాము. కావున వాటిలో కొన్నిటిపై వారుస్వారీచేస్తారు, మరి కొన్నిటిని (వాటి మాంసాన్ని) వారు తింటారు.ا

Tafseer

Tafseer

36.75

لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُنْدٌ مُحْضَرُونَ

వారు (ఆ దైవాలు), తమ కెలాంటి సహాయం చేయలేరు. అయినా! వీరు (సత్య-తిరస్కారులు) వారి (ఆదైవాల) కొరకు సైన్యం మాదిరిగా సర్వ సన్నద్ధులై ఉన్నారు.ا

Tafseer

Tafseer

36.74

وَاتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ آلِهَةً لَعَلَّهُمْ يُنْصَرُونَ

మరియు వారు అల్లాహ్‌ను వదలి, ఇతరులను ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. బహుశా వారి వలన తమకు సహాయం దొరుకు తుందేమోననే ఆశతో!ا

Tafseer

Tafseer

36.77

أَوَلَمْ يَرَ الْإِنْسَانُ أَنَّا خَلَقْنَاهُ مِنْ نُطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُبِينٌ

ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా మేము అతనిని వీర్య బిందువుతో సృష్టిచామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు?ا

Tafseer

Tafseer

36.76

فَلَا يَحْزُنْكَ قَوْلُهُمْ ۘ إِنَّا نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ

కావున (ఓ ము హమ్మద్‌!) వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి! మాకు, వారు దాచేవీ మరియు వెలిబుచ్చేవీ అన్నీ బాగా తెలుసు.ا

Tafseer

Tafseer

36.79

قُلْ يُحْيِيهَا الَّذِي أَنْشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ

ఇలా అను: మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది.ا

Tafseer

Tafseer

36.78

وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ ۖ قَالَ مَنْ يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ

మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరచిపోయాడు. అతడు ఇలా అంటాడు: కృశించి పోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?ا

Tafseer

Tafseer

36.81

أَوَلَيْسَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِقَادِرٍ عَلَىٰ أَنْ يَخْلُقَ مِثْلَهُمْ ۚ بَلَىٰ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ

ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటిలాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు.ا

Tafseer

Tafseer

36.80

الَّذِي جَعَلَ لَكُمْ مِنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا أَنْتُمْ مِنْهُ تُوقِدُونَ

ఆయనే పచ్చని చెట్టు నుండి మీ కొరకు అగ్నిని పుట్టించేవాడు, తరువాత మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటారు.ا

Tafseer

Tafseer

36.83

فَسُبۡحَٰنَ ٱلَّذِي بِيَدِهِۦ مَلَكُوتُ كُلِّ شَيۡءٖ وَإِلَيۡهِ تُرۡجَعُونَ

ఎందుకంటే! సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) చేతిలోప్రతిదానికిసంబంధించిన సర్వాధికారాలు ఉన్నాయి మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.ا

Tafseer

Tafseer

36.82

إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَنْ يَقُولَ لَهُ كُنْ فَيَكُونُ

నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచుకున్నప్పుడు దానితో: అయిపో! అని అంటాడు, అంతే! అది అయిపోతుంది.ا

Tafseer

Tafseer

సూరా యాసీన్ సారాంశం:

సూరా యాసీన్‌ను “ఖురాన్ యొక్క హృదయం”గా పేర్కొంటారు. ప్రవక్త ముహమ్మద్ (స) పేరు కూడా “యాసీన్” అని తరచుగా చెబుతారు.  ఇది 83 శ్లోకాలను కలిగి ఉంది మరియు ఇది ఖురాన్ యొక్క 36వ అధ్యాయం మరియు ఇది 807 పదాలు మరియు 3,028 అక్షరాలను కలిగి ఉంది. ఇందులో 5 రుకు (విభాగాలు) ఉన్నాయి. ఇది 22వ జుజ్‌లో భాగం మరియు 23వ జుజ్‌లో కొనసాగుతుంది. ఇది మక్కాలో వెల్లడి చేయబడింది, కాబట్టి దీనిని మక్కీ సూరా అని పిలుస్తారు మరియు ఈ క్రింది ముఖ్య అంశాలను నొక్కి చెబుతుంది:

1. ప్రవక్త యొక్క ధృవీకరణ:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన సందేశం యొక్క సత్యాన్ని నొక్కి చెప్పడం ద్వారా సూరా ప్రారంభమవుతుంది. అతను ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి అల్లా పంపిన దూత అని ఇది నొక్కి చెబుతుంది.

2. అల్లాహ్ సంకేతాలు:

సృష్టి ద్వారా అల్లా యొక్క ఉనికి మరియు శక్తి యొక్క సంకేతాలను సూరా హైలైట్ చేస్తుంది. ఇది రాత్రి మరియు పగలు యొక్క ప్రత్యామ్నాయం, మొక్కల పెరుగుదల మరియు విశ్వం యొక్క అద్భుతాలను ప్రస్తావిస్తుంది, అల్లాహ్ యొక్క గొప్పతనానికి సాక్ష్యంగా ఈ సంకేతాలను ప్రతిబింబించేలా ప్రజలను ప్రోత్సహిస్తుంది.

3. సందేశం తిరస్కరణ:

 సందేశాన్ని తిరస్కరించే వారి మొండితనాన్ని ఇది సూచిస్తుంది. వారికి స్పష్టమైన సంకేతాలు మరియు అద్భుతాలు చూపబడినప్పటికీ, చాలామంది సత్యాన్ని తిరస్కరిస్తూనే ఉన్నారు, ఇది వారి అనివార్యమైన శిక్షకు దారి తీస్తుంది.

4. మునుపటి దేశాల ఉదాహరణలు:

తమ ప్రవక్తలను తిరస్కరించిన మరియు పర్యవసానంగా విధ్వంసాన్ని ఎదుర్కొన్న గత సమాజాల కథలను సూరా వివరిస్తుంది. సత్యాన్ని తిరస్కరించే వారికి ఇది ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది.

5. పునరుత్థానం మరియు పరలోకం:

సూరా యాసీన్ పునరుత్థానం మరియు మరణం తర్వాత జీవితం యొక్క వాస్తవికతను చర్చిస్తుంది. తీర్పు దినాన మానవులందరూ పునరుత్థానం చేయబడతారని, అక్కడ వారు తమ చర్యలకు జవాబుదారీగా ఉంటారని ఇది నొక్కి చెబుతుంది.

6. దైవిక దయ:

సూరా విశ్వాసులకు అల్లా దయ మరియు సందేశాన్ని అంగీకరించిన వారికి బహుమతులు అందజేస్తుంది. ఇది నీతిమంతులు మరియు అవిశ్వాసుల విధి మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తుంది, విశ్వాసులు స్వర్గంలో నివసిస్తారని నొక్కి చెబుతుంది.

7. ప్రతిబింబించడానికి కాల్ చేయండి:

ప్రజలు తమ జీవితాలను, వారి చుట్టూ ఉన్న అల్లా యొక్క సంకేతాలను మరియు పునరుత్థానం మరియు జవాబుదారీతనం యొక్క అంతిమ సత్యాన్ని ప్రతిబింబించమని ప్రజలను ప్రోత్సహించడం ద్వారా సూరా ముగుస్తుంది.